![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -100 లో..... మహాని తీసుకొని చక్రి సర్టిఫికేట్స్ అప్లై చెయ్యడానికి కాలేజీకి వస్తాడు. అక్కడ మేడమ్ తో తను మహా.. నా భార్య.. మేం లవ్ మ్యారేజ్ చేసుకున్నామని చక్రి చెప్తుంటే మహా కోపంగా చూస్తుంది. కాసేపటికి చక్రితో ఆ మేడమ్ క్లోజ్ గా ఉండడం చూసి మహా జెలస్ గా ఫీల్ అవుతుంది. ఏంటి అలా చూస్తుంది.. కొంపదీసి జెలస్ గా ఫీల్ అవుతుందా ఏంటని చక్రి అనుకుంటాడు. మీరు అప్లై చేశారు కదా పదిహేను రోజుల్లో మీ సర్టిఫికేట్స్ మీ చేతుల్లో ఉంటాయని మేడమ్ అనగానే మహా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది.
మీరు కొత్తగా కన్పిస్తున్నారని చక్రి అనగానే అంటే ఏమైనా మొటిమలు అయ్యాయా అని మహా అంటుంది. కాదండి.. ఇంత హ్యాపీగా చూడడం ఇదే మొదటిసారి అని చక్రి అంటాడు. మరొకవైపు గాయత్రి పెళ్లికి ఏర్పాట్లు జరుగుతాయి. గాయత్రి వాళ్ళ ఇంటి ముందు నుండే మాధవ, చక్రి వెళ్తుంటే.. గాయత్రి వాళ్ళ నాన్న కావాలనే అటుగా వెళ్లి ఎవరినో పెళ్లికి పిలుస్తూ.. నా అల్లుడికి జాబ్ ఉంది అంటూ గొప్పగా చెప్తాడు. అదంతా కిటికీలో నుండి గాయత్రి చూస్తుంది. ఆ తర్వాత చక్రికి మహా ఐస్ క్రీమ్ తీసుకొని వచ్చి మీరు పార్టీ అడిగారు కదా ఇదే పార్టీ అని ఇస్తుంది. ఆ తర్వాత మహా, చక్రి ఇంటికి వచ్చేసరికి మాధవ డల్ గా కూర్చొని ఉంటాడు. ఆ తర్వాత గాయత్రి పెళ్లిపత్రిక పట్టుకొని ఒకతను వచ్చి వీళ్ళ ఇల్లు ఎక్కడ అని నారాయణని అడుగుతాడు. పెళ్లికూతురు తల్లి బావిలో దూకింది.. పెళ్లి ఆగిపోయిందని నారాయణ చెప్తాడు. అప్పుడే మాధవ వచ్చి అదేం లేదని చెప్పి ఎదురు ఇల్లు వాళ్ళది.. వెళ్ళండి అని మాధవ అంటాడు. ఆ పెళ్లిపత్రిక చూస్తూ మాధవ బాధపడతాడు.
మరొకవైపు గాయత్రికి తాయారు భోజనం తీసుకొని వస్తుంది. నాకు వద్దని గాయత్రి కోప్పడుతుంది. నాకు బావ కావాలి అంటుంది. మీకు ఏం కావాలో.. ఏం వద్దో.. మాకు తెలుసని తాయారు అంటుంది. ఆ తర్వాత మాధవ డల్ గా నేలపై పడుకొని ఉంటాడు. అతన్ని చూసి ఇంట్లో అందరు బాధపడతారు. ఆ తర్వాత మహా డోర్ వెయ్యబోతుంటే గాయత్రి ఇంటికి వస్తుంది. మహా లోపలకి పిలుస్తుంది. ఎందుకు వచ్చావే అని ఇంట్లో అందరు కోప్పడతారు. తరువాయి భాగంలో గాయత్రి మెడలో మాధవ తాళి కట్టబోతుంటే తాయారు, పురుషోత్తం వస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |